Ramcharan : రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.. ఈ వేడుకకి రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. కాగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పుట్టబోయే బిడ్డ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు..

బ్లాక్ కలర్ సూట్ లో రామ్ చరణ్, క్రీమ్ కలర్ శారీలో రాయల్ లుక్ లో మెరిసిపోతూ ఈ జంట అక్కడి మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఉపాసన మీడియాతో మాట్లాడుతూ రామ్ పై తనకున్న ప్రేమను మరోసారి తెలిపింది. రామ్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీలో భాగం అయ్యేందుకు ఇక్కడికి వచ్చాను. కొంచెం నర్వస్ గా ఉంది. కానీ చాలా సంతోషంగా ఉంది అని ఉపాసన అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఉపాసన ఇప్పుడు ఆరో నెల గర్భవతి.. పుట్టబోయే బిడ్డ మాకు ముందుగానే ఎంతో అదృష్టం తోపాటు ఇంతమంది ప్రేమను మాకు అందించాడు. తనకి ఎంతమంది ప్రేమ అభిమానం దొరికిందని రామ్ అన్నాడు. ఇటీవల గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న రామ్ చరణ్ అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నీఫర్ ఆస్టన్ ఉపాసనకి డెలివరీ చేయనున్నారని తెలిపారు. తమకు పుట్టబోయే బిడ్డ వల్లే ఇంతటి అదృష్టం వారికి కలిగిందని రామ్ తెలిపారు.