Upasana : బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ ,సిద్ధార్థ మల్హోత్రాలు ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం అందరికీ తెలిసిందే.. ప్రేమలో మునిగిన ఈ జంట ఫిబ్రవరి 7న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. రాజస్థాన్లోని జై సల్మేర్ ప్యాలెస్ లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా తమ పెళ్లి వీడియోలు షేర్ చేసింది కియరా, సిద్దార్థ్ పంచుకున్నారు..

కియార సిద్ధార్థ పెళ్లి తక్కువ మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగింది. అయితే వీరి పెళ్లి వేడుకకు కూడా చాలా కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారట. ఇందులో భాగంగా అందిన అతిధులు జాబితాలో కొంతమంది సన్నిహితులు మాత్రమే ఉన్నారు. అయితే వీరి పెళ్లి జరిగినప్పుడు నుండి టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా వీరి పెళ్లికి హాజరయ్యారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది..
తాజాగా ఏరా అద్వానీ సిద్ధార్థ మల్హోత్రా వారి పెళ్లి వీడియోలు షేర్ చేసుకోగా.. ఆ పెళ్లి కి రాలేకపోయామని ఉపాసన కామెంట్ చేసింది. ఇందులో భాగంగా నూతన దంపతులకు సారీ కూడా చెప్పింది. ఉపాసన కియారా తమ వివాహ ఆల్బమ్ ను సోషల్ మీడియాలో పంచుకోగా వారు షేర్ చేసిన పోస్టులకు గాను ఉపాసన కామెంట్ చేసింది. అందులో భాగంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ మీ జంట చాలా అందంగా ఉంది. మేము మీ పెళ్లికి రాలేనందుకు మమ్మల్ని క్షమించండి. మీరిద్దరూ ఎల్లప్పుడూ ఇంతే ప్రేమతో ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ఉపాసన తెలిపింది
.
ఇక ఇదే వీడియోకు రామ్ చరణ్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు . మీ ఇద్దరి పెళ్లి స్వర్గంలో ఫిక్స్ చేసిన మ్యాచ్ అని కామెంట్ చేశారు. దాంతో ఉపాసన రాంచరణ్ ఇద్దరు వీరి పెళ్లికి హాజరు కాలేదని.. ఆ సమయంలో వెళ్లలేకపోయినందుకు వారికి సారీ కూడా చెప్పింది ఉపాసన.