Samantha: హీరోయిన్ సమంత అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం గలది. టాప్ హీరోయిన్ అయినా గాని తోటి నటీనటులతో మంచి సత్సంబంధాలు ఉండేలా వ్యవహరిస్తది. ఈ కారణంగానే చాలామంది ఇండస్ట్రీలో టాప్ హీరోలు సామ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సమంతకి మంచి బాండింగ్ ఉంది. రాంచరణ్ తో పాటు అతని భార్య ఉపాసనకి కూడా సమంత మంచి ఫ్రెండ్.
అయితే 2021 లో సమంత అక్టోబర్ నెలలో మయోసైటీస్ అనే ప్రాణాంతకర వ్యాధి బారిన పడటం తెలిసిందే. ఈ వ్యాధిలో స్టేజిలు దాటిపోయి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు తెలియడం సమంతాకి అప్పట్లో టెన్షన్ పుట్టించిందట. అయితే ఇప్పుడు సమంత పూర్తిగా కోలుకుంది. యధావిధిగా సినిమాలు చేసుకుంటూ ఉంది. ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధిలో నుండి సమంత ప్రాణం బయట పడటానికి కారణం ఉపాసన అంట.
మేటర్ లోకి వెళ్తే ఈ వ్యాధి బారిన పడిన వెంటనే సమంత ముందుగా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ చరణ్ భార్య ఉపాసన దృష్టికి తీసుకెళ్లిందట. ఆ సమయంలో ఉపాసన సమంతకి చాలా ధైర్యం చెప్పి.. ఈ వ్యాధికి సంబంధించి వరల్డ్ స్పెషలిస్ట్ ఎవరున్నారో తన తాత గారి ద్వారా తెలుసుకుందాట. తర్వాత సదరు డాక్టర్ లకి సమంతాన్ని రిఫర్ చేసి రికమండేషన్ చేసి.. ఆరు నెలలలోనే కోలుకునేలా.. ఉపాసన వెనకుండి నడిపించిందట. ఇంత త్వరగా సమంత కోలుకోవడానికి సినిమాలో తిరిగి నటించడానికి ప్రధాన కారణం ఉపాసన అని సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది.