Ramcharan Movie Leak : సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం తమిళ ఇండస్ట్రీ హీరోతో కాకుండా అవుట్ సైడ్ హీరో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ చరణ్ తో శంకర్ సినిమా చేయటం.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో.. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ 3 విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో చేద్దామని శంకర్ తనతో చర్చలు జరిపినట్లు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో చరణ్ కి బాగా సూట్ అవుతుందని.. శంకర్ కి చెప్పటంతో … ఈ ప్రాజెక్టు ఆ రీతిగా సెట్స్ పైకి వెళ్ళినట్లు స్పష్టం చేశారు. పైగా ఈ సినిమాలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అటువంటి విజువల్స్ ఏమి ఉండవని అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా…రాజకీయంగా స్టోరీ ఉండబోతున్నట్లు కామెంట్లు చేశారు. సోషల్ మెసేజ్ తో కూడిన రివెంజ్ డ్రామా.. అని స్పష్టం చేశారు. దీంతో దిల్ రాజు వ్యాఖ్యలతో ఒక స్టోరీ లైన్ బయట గట్టిగా వినిపిస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక పొలిటికల్ లీడర్ గా చరణ్ పెద్ద తరహా పాత్రకి సంబంధించి కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో విడుదలయ్యాయి. మరోపక్క సూటు వేసుకున్న చరణ్ యొక్క మరో పాత్ర ఫోటోలు కూడా స్టార్టింగ్ లో బయటకి వచ్చాయి.
చరణ్ సూట్ ఫోటోలు పాత్ర ఎలక్షన్ ఆఫీసర్ పాత్ర అని అప్పట్లోనే టాక్ నడిచింది. దీంతో ప్రజాభిమానం ఉండి ఎన్నికలలో జరిగిన అవినీతి కారణంగా చరణ్ తండ్రి ఓడిపోవడం జరుగుద్దట. ఆ తర్వాత విలన్స్ చరణ్ కటుంబాన్ని నాశనం చేస్తారట. ఈ క్రమంలో తండ్రికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే తరహాలో కొడుకు రంగంలోకి దిగబోతాడట. ఎన్నికల అధికారిగా మారి తన తండ్రి ఓటమికి కుటుంబాన్ని నాశనం చేసిన ప్రత్యర్థులకు… చిత్తు చేసే రివేంజ్ డ్రామా అని సోషల్ మీడియాలో జనాలు డిస్కషన్ చేసుకుంటున్నారు. తన బ్యానర్ లో ఇది 50వ సినిమా కావటంతో దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.