Ram Charan : రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం రామ్ చరణ్ పారితోషకం అధికంగా తీసుకున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ సైతం కంప్లీట్ చేసుకోనుంది. ఈ క్రమంలోనే ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 100 కోట్లను తీసుకుంటున్నట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు సైతం ఈ విషయంలో రామ్ చరణ్ అడిగినంత పారితోషకం ఇస్తున్నాడని కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు బన్నీ కూడా పుష్ప 2 కోసం రూ.100 కోట్ల పారితోషకం తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరొక పక్క ప్రభాస్ కూడా రూ. 100 కోట్ల పారితోషకం అందుకుంటున్నారు. కోలీవుడ్ హీరో విజయ్ కి కూడా వారసుడు సినిమా కోసం ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు కూడా రూ.100 కోట్లు పారితోషకం ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికైతే భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. కాబట్టి స్టార్ హీరోల పారితోషకం కూడా రూ.100 కోట్లకి పెరిగిందని చెప్పవచ్చు.