Pushpa 2 : పుష్ప -2 లో చెర్రీ.. ఈ క్రేజీ కాంబోలో వచ్చే సూపర్ సీన్ ఇదేనట.!

Pushpa 2 :  అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ గా మార్చేసిన సినిమా.. టాలీవుడ్ హీరో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా పుష్ప.. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్.. సుకుమార్ టేకింగ్.. రష్మిక గ్లామర్.. మొత్తానికి సినిమా కంటెంట్.. యావత్ భారత ప్రేక్షకులను అలరించింది. భాషా బేధాలు లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. భారతదేశంలోనే కాదు రష్యా వంటి విదేశాలను ఈ చిత్రం మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది..

Ram Charan acting on allu arjun pushpa 2 movie
Ram Charan acting on allu arjun pushpa 2 movie

దాంతో పుష్ప పార్ట్ 2 సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ ను చూపించబోతున్నట్లు ఫిలింనగర్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అంతేకాదు అల్లు అర్జున్ బన్నీకి క్లైమాక్స్ లో వచ్చే ఓ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని.. ప్రస్తుతం అందుకు సంబంధించిన డిస్కషన్ బన్నీ చెర్రీ కి మధ్యన కూడా జరిగిందని తెలుస్తోంది..

ఆ సీన్ గురించి విన్న వెంటనే పుష్ప సినిమాలో నటించడానికి చెర్రీ ఒప్పుకున్నారని సమాచారం. వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చే ఆ సీన్ సిల్వర్ స్క్రీన్ పై చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ అట. ఇప్పటికే అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన ఎవడు సినిమా మంచి హిట్ ను అందుకుంది. మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రానుంది అని తెలియగానే.. మెగా ఫాన్స్ తో పాటు బన్నీ అభిమానులు కూడా ఫుల్ ఖుషి గా ఉన్నారు.