Rakul Preeti Singh : వివాహానికి సిద్ధమైన రకుల్ ప్రీతిసింగ్.. ముహూర్తం ఖరార్..! 

Rakul Preeti Singh :  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రారండోయ్ వేడుక చూద్దాం, బ్రూస్లీ, సరైనోడు వంటి చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రకుల్ ప్రీతిసింగ్ గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ సినిమాలలో కనిపించడం లేదు. ఇప్పుడు వరుసగా బాలీవుడ్ లో చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ అక్కడే సెటిల్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

Rakul Preeti Singh get ready for marriage..!
Rakul Preeti Singh get ready for marriage..!

ఈ విషయంపై ఎప్పుడు స్పందించమని అడిగినా ఆమె ఇది పుకార్లు మాత్రమే అన్నట్టుగా సమాధానాన్ని దాటవేస్తూ వచ్చింది.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కెరియర్ కోసమే రకుల్ ప్రీతిసింగ్ జాకీ భగ్నానిని 2023 ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతోంది అంటూ ఇప్పుడు వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ పెళ్లి వివాదం మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పాలి. ఏదిఏమైనా జాకీ భగ్నానితో రకుల్ ప్రీతిసింగ్ వివాహం జరిగితే మరో జంట వైవాహిక జీవితంలోకి కొత్త ఏడాది అడుగుపెట్టినట్టే అవుతుంది.