Rajamouli : వాల్తేరు కంటే రాజమౌళి కి వీరసింహా రెడ్డి ఎక్కువ నచ్చింది ?? ఒకే ఒక్క మాట అన్నాడు !

Rajamouli :ఈ సంక్రాంతి బరిలో ముందుగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి విడుదలై మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.. ఇక ఆ తర్వాత రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా లో మీకు ఏ సినిమా నీకు నచ్చింది అని రాజమౌళి అడుగగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Rajamouli likes veera Simha Reddy movie on Walteru veeraya comparison
Rajamouli likes veera Simha Reddy movie on Walteru veeraya comparison

నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ అండ్ డైనర్ సినిమా.. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. బాలకృష్ణ పంచ్ పొలిటికల్ డైలాగ్స్ తో మరోసారి తన మార్కును చూపించారు. తమన్ అందించిన బిజిఎం కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది..

 

వాల్తేరు వీరయ్య సినిమా లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మేనియా చూపించారు.. చిరు తనదైన శైలిలో స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి రవితేజ మహత్యం వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. చిరంజీవి శృతిహాసన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి..

 

తాజాగా ఈ రెండు సినిమాలను వీక్షించిన దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాలలో తనకు వీరసింహారెడ్డి సినిమా బాగా నచ్చిందని‌‌.. ఈ సినిమాలో ఫైట్ యాక్షన్ సన్నివేశాలతో పాటు డైలాగులు కూడా బాలకృష్ణ అద్భుతంగా పేల్చారు అంటూ రాజమౌళి తన సన్నిహిత వర్గాల వారితో చెప్పారట. రెండు సినిమాలలో ఏదో ఒక్క సినిమానే ఫైనల్ గా చెప్పమంటే వీరసింహారెడ్డి కే తన ఓటు అని రాజమౌళి అన్నారట..

ఇక చిరంజీవి సినిమా కూడా చాలా బాగుందని మరోసారి మెగాస్టార్ తన మార్కును చూపించారని అన్నారట ప్రస్తుతం రాజమౌళి ఈ రెండు సినిమాలపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ సినిమానే బాగుంది అన్నారు అంటూ పోస్టులు చేస్తున్నారు.