Rajamouli : దిగ్గజ ధీరుడు రాజమౌళి గురించి యావత్ దేశానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి కెరియర్ లో తెరకెక్కించింది కొన్ని సినిమాలే అయినా అన్నీ కూడా చరిత్ర రికార్డు సృష్టించాయి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరు సంపాదించుకున్న హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించారు. అంతేకాదు హాలీవుడ్ డైరెక్టర్స్, క్రిటిక్స్ అందరూ కూడా రాజమౌళిని తెగ పొగిడేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు రేసులో నిలవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఇంత విజయం సంపాదించింది కాబట్టి పార్ట్-2 వచ్చే అవకాశం కూడా ఉంది అనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

రాజమౌళి… జాతీయ మీడియా తాజాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అందులో రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి స్పందించారు. ఈ సినిమా సీక్వెల్ గురించి మొదట ఆలోచన లేదు.. అయితే ఐడియా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ మీద ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ప్రస్తుతం అయితే రైటింగ్ స్టేజ్ లోనే ఉంది ఇప్పుడే ఏం చెప్పలేను అని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టాడు అని ఈ సినిమా పూర్తవగానే తప్పకుండా ఆర్ ఆర్ ఆర్ 2 గురించి క్లారిటీ ఇస్తారు అని కూడా తెలుస్తోంది.