Rajamouli : రాజమౌళి బ్రెయిన్ లో భారీ డీల్ ప్లాన్..!

Rajamouli : ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత.. రాజమౌళి అభిమానులు కాకుండా ఇండస్ట్రీ మొత్తం నెక్స్ట్ సినిమా ఏంటి అనే చర్చ జోరుగా నడుస్తుంది.. సాధారణంగా రాజమౌళి సినిమాకి మధ్య భారీ గ్యాప్ ని తీసుకుంటారు.. కానీ ఈసారి మాత్రం సినిమాని త్వరగానే తెరపైకి ఎక్కించాలనుకుంటున్నారని సినీ వర్గాల టాక్.. దర్శక ధీరుడు రాజమౌళికి నెట్ఫ్లిక్స్ అనే ఓటిటీ సంస్థ వారు ఒక భారీ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం..

ఎందుకు అలా అంటే గత కొంతకాలంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిగతా సంస్థలతో పోటీ పడలేకపోతున్న విషయం తెలిసిందే.. దాంతో రోజురోజుకు ఈ సంస్థ గ్రాఫ్ కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఆసియా దేశాల కంటే యూరప్ దేశాలలో నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రైబర్స్ భారీగా తగ్గిపోతున్నారు. ఇంకా ఇండియా విషయానికి వస్తే మిగతా ఓటీటీ సంస్థల కంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తమని సమాజం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ సంస్థ భారత్ పై ఎక్కువ దృష్టి సారించాలని ఈ మేరకు సంస్థ సీఈఓ రీడ్ ఫాస్టింగ్ సైతం భారత్ పై దృష్టి సారించాలని అనుకున్నట్లు సమాచారం..

Rajamouli and Netflix on big deal for web series
Rajamouli and Netflix on big deal for web series

రాజమౌళిని కలిసి ఇప్పటికే ఓ ప్రాజెక్టు నిర్మించడం ‘నెట్‌ఫ్లిక్స్’ వారు చర్చించినట్లు సమాచారం. భారీ యాక్షన్ డ్రామా గా ఉండబోతున్నట్లు ఈ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా తమ సత్తా ఓటీటి లో చూపాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తుంది.. ఆర్ఆర్ఆర్ చిత్రం స్క్రీనింగ్ ఫుల్ వైట్ గా నెట్ ఫిక్స్ కు దీంతో ‘నెట్‌ఫ్లిక్స్’ అంటే రాజమౌళి అన్నట్లుగా మార్కెట్ చేయాలని ‘నెట్‌ఫ్లిక్స్’ వారు చేశారని సమాచారం. దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం వెబ్ సిరీస్ అంటే చాలా సమయం తీసుకుంటుంది అని ఆలోచించి డెసిషన్ తీసుకుంటానని చెప్పారట.. ఆ వెబ్ సిరీస్ చేయడానికి భారీ మొత్తంలో డీల్ కుదిరిందని సమాచారం..

Advertisement