Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లో ‘ ఆ అమ్మాయి ‘తో ఎవరు మాట్లాడినా రాహుల్ సిప్లిగంజ్ కుళ్లిపోతున్నాడు ఎందుకు ? అంత నచ్చిందా ?

Bigg boss : బిగ్ బాస్ సీజన్ 6కు ఉన్న హౌజ్ మెంబర్స్ రేటింగ్ ను సంపాదించి పెట్టాలనే ఆత్రంతో అవసరం లేకపోయినా అరుపులు, కేకలు, గొడవలతో ప్రేమలు కొంచెం డోసు పెంచి బూతులతో ఏదో అలా అర్దం అయ్యి, కానట్లు నడిపిస్తున్నారు. ఇక వీళ్లతో వ్యాపారం సాగదు అని బిగ్ బాస్ రంగలోకి దిగాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టాడు. ఇంట్లోకి ఓ జోకర్ ను ప్రవేశపెట్టి ఫన్ క్రియేట్ చేశాడు. ఇక మెంబర్స్ ఆట గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

రీసెంట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కంటెస్టెంట్లపై కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ గోల్డెన్ ఆపర్చునిటీ అని అరియానా అంటే బిగ్ బాస్ గోల్డెన్ ఆపర్చునిటీ కాదు, లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని చెప్పాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. అరియానా మాట్లాడుతూ.. అర్జున్, శ్రీ సత్య మాటర్ ఏంటి అనగానే అంటే మనోడు లైన్ వేయడానికి వచ్చిండేమో బిగ్ బాస్ నాకు తెలీదు అంటూ తన స్టైల్ లో కామెంట్స్ చేశాడు.

rahul sipligunj hurted the reason is Bigg Boss 6 Telugu
rahul sipligunj hurted the reason is Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu : ‘అందుకే బిగ్ బాస్ కు వచ్చాడేమో..’

వెంటనే అవును నువ్వు పునర్నవి టచ్ లో ఉన్నావా అని అరియానా అడగ్గా.. దీనికి ఏ లేదు అని నవ్వుకుంటూ ఆన్సర్ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. ప్రజంట్ రాహుల్.. అర్జున్, శ్రీ సత్యలపై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ లో శ్రీ సత్య ఎవరితో మాట్లాడినా.. రాహుల్ అసూయ ఫీల్ అవుతున్నాడు. ఆ పిల్ల అంత నచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏమో అయి కూడా ఉండొచ్చు అంటూ మరికొంతమంది అంటున్నారు. మరి దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.