Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పడుతున్న విషయం తెలిసిందే. సమంత అందుకు అవసరమైన చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్.. సమంతకు సందేశంతో కూడిన ఓ గిఫ్ట్ ఇచ్చాడు..

సమంత ఇప్పుడు నీ దారి చీకటిగా ఉండొచ్చు.. కానీ త్వరలోనే అది మెరుస్తుంది. నీ శరీరంలో కదలికలు కష్టంగా ఉండొచ్చు.. కానీ త్వరలోనే అన్నీ బాగుంటాయి. ఎందుకంటే నువ్వు ఉక్కు మహిళవి. నువ్వు ఓ యోధురాలివి.. అని రాసి ఉన్న సందేశాన్ని సమంతకు పంపించగా.. ఆ ఫొటోను సమంత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి రాహుల్కు ధన్యవాదాలు తెలిపింది.. కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఈ పోస్ట్ అంకితం.. మీరు పోరాడుతూనే ఉండండి. అప్పుడే గతంలో కంటే బలంగా అవుతారు అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ లో రాహుల్ సమంతకి కావలసిన మనోధైర్యాన్ని అందించాడు.. నాగచైతన్య తో విడిపోయిన తరువాత సమంత మానసికంగా కృంగిపోయిందని జీవితం మీద ఎదగాలన్న కసితో కఠినమైన వర్గౌట్స్ చేసింది . అందుకు నిదర్శనమే ఈ వ్యాధి అని. నువ్వు ఇక తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నాగచైతన్య పేరు ఎత్తకుండా తన గురించి నువ్వు మర్చిపో తను లేకుండా నువ్వు ధైర్యంగా ఉండగలవు అని మనోధైర్యాన్ని అందిస్తూ పోస్ట్ చేశాడు రాహుల్ రవీంద్రన్. ఇప్పటికైనా సమంత ఆ విషయాన్ని మరిచిపోయి త్వరగా కోలుకుంటే చాలనుకుంటున్నారు ఆమె అభిమానులు..