Racking Rakesh జబర్దస్త్ రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత కి జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.. కాగా గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.. అయితే రాకేష్ సుజాత కంటే ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
రాకింగ్ రాకేష్ జబరస్త్ స్కిట్ లో సుజాత చేయడం వలన వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమకు దారి తీస్తాయి. మొదట్లో రాకేష్ సుజాత ఇద్దరు కూడా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అందరినీ నమ్మించారు. కానీ స్టేజి పైనే హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు క్లారిటీ వచ్చింది. రాకేష్ సుజాత ఇటీవల ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకోగా పలువురు బుల్లితెర స్టార్స్ హాజరైసందడి చేశారు.
జబర్దస్త్ షో తో ఫేమస్ అయిన రాకేష్.. బుల్లితెరకు పరిచయమైన మొదట్లోనే ఓ బుల్లితెర నటిని ప్రేమించాడు.. ఆ నటి కూడా రాకేష్ ను ఇష్టపడింది ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు కానీ వారి కులాలు వేరు కావడంతో వాళ్ల పెళ్లికి ఇంట్లో వాళ్ళు నో చెప్పారట.. అప్పటినుంచి రాకేష్ ఆమెకు దూరమయ్యాడు ఆ బాధలో ఉన్నప్పుడే సుజాత తనకు పరిచయమైంది. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెళ్లికి దారి తీస్తాయని టాక్ వినిపిస్తోంది.. రాకేష్ తను కోరుకున్న సుజాతను పెళ్లి చేసుకోనున్నడు.