పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి.. సూపర్ గుడ్ న్యూస్.!


అల్లు అర్జున్ పుష్ప- 1తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా ఆల్ ఇండియా లెవెల్ సూపర్ హిట్ అందుకోవడంతో సినీ ప్రేక్షకులు పుష్ప సినిమా పార్ట్ -2 ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు..! తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు నిర్వహించారు సుకుమార్..!

India day parade in new york attend Allu Arjun meet mayor eric Adams
India day parade in new york attend Allu Arjun meet mayor eric Adams

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా దేవి శ్రీ ప్రసాద్ గా తెరకెక్కి పుష్ప పార్ట్-1 ఇండియా లెవెల్ లో రిలీజ్యి భారీ స్థాయి కలెక్షన్ అందుకున్న సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 ఎప్పుడు ఎప్పుడా అని సినీ అభిమానులతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆత్రతగా ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీ పార్ట్ వన్ లో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ పాటలు.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రోజులపాటు ప్రజలందరిలో ఎక్కడ చూసినా ఈ పాటలే మారుమోగాయి. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం మూడు పాటలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఏది ఏమైనా సుకుమార్ అల్లు అర్జున్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతునే వచ్చాయి.. సినీ ప్రేక్షకులు సైతం పుష్ప పార్ట్- 2 కై ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Advertisement