Pushpa 3 : పుష్ప -3 కూడా రాబోతోంది.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

Pushpa 3 :  సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏకంగా హిందీలో కూడా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసింది. ఈ క్రమంలోనే సీక్వెల్ చేయాలనే ఆలోచనలో భాగంగా సుకుమార్ ఇప్పుడు పుష్ప -2 సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. అయితే పుష్ప వన్ లో సాధారణ కూలీ స్మగ్లర్గా ఎలా ఎదిగాడు అన్నది చూపించారు. అయితే రెండవ పార్టులో అతని రూలింగ్ తో పాటు అతని డౌన్ ని కూడా చూపిస్తారట.

Advertisement
Pushpa 3 also coming soon..but this is the twist..!
Pushpa 3 also coming soon..but this is the twist..!

మరి పార్ట్ 2 చివర్లో పార్ట్ 3 కి సంబంధించిన క్లూ వదిలి ముగిస్తారట మేకర్స్. ముఖ్యంగా పుష్ప 3 కూడా కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అయితే పుష్ప 3 రావాలి అంటే మరో ఐదు సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే అని సుకుమార్ చెప్పినట్లు సమాచారం. పుష్ప 1,2 వెంటవెంటనే తీసినా… పార్ట్ 3 కి మాత్రం కనీసం నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట సుకుమార్. ఈ లోగా మరో రెండు సినిమాలు పూర్తి చేయాలని కమిట్మెంట్ పెట్టుకున్నారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతనే పుష్ప 3 రాబోతోందని సమాచారం. అందులో ఒకటి సుకుమార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సీక్వెల్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement