Prabhas : ప్రభాస్ – గోపీచంద్ ఆ హీరోయిన్ కోసం గొడవపడ్డారా..?

Prabhas : బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ మామూలుగా ఉండదని.. అభిమానులకు మంచి కిక్కిస్తుందని కూడా చెబుతున్నారు . ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి విడుదలైన ప్రోమో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రోమోలో భాగంగా గోపీచంద్ ,ప్రభాస్ ఆ హీరోయిన్ కోసం గొడవపడ్డారు అని తెలుస్తోంది. ప్రోమోలో భాగంగా బాలకృష్ణ, ప్రభాస్ తో… నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటి..? అని అడగ్గా.. ప్రభాస్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు.

Advertisement
Prabhash, Gopichand fight eachother for heroine..!
Prabhash, Gopichand fight eachother for heroine..!

ప్రభాస్ మాట్లాడుతూ..” మీకు ఏ ఇబ్బందులు లేవు అప్పుడు.. ఇప్పుడు మాకు ఏదీ లేకపోయినా అనవసరమైన గోల ఎక్కువ” అని ప్రభాస్ అన్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ.. రామ్ చరణ్ కి కాల్ చేసి ప్రభాస్ ని ఆట పట్టించారు. ప్రభాస్ .. ఓ చరనూ రేయ్ నువ్వు నా ఫ్రెండా? శత్రువా? అని అన్నారు. ఇలా సాగుతుండగా మధ్యలో గోపీచంద్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. మనవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని రామ్ చరణ్ కి ఫోన్ చేశాడు.. చరణ్ చిన్నది లీక్ న్యూస్ ఇచ్చాడు అని బాలకృష్ణ అనగానే.. రాణి గురించే కదా సార్.. అని గోపీచంద్ అన్నాడు. దీంతో ప్రభాస్ ఇరికించకురా అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు . 2008లో ఒక హీరోయిన్ కోసం మీరిద్దరూ గొడవపడ్డారట కదా అని అడగ్గానే..” చెప్పరా.. నేనైతే పడలేదు… నీకేమైనా ఉంటే చెప్పు..” అంటూ గోపీచంద్ ని ఇరింకించారు ప్రభాస్. మొత్తానికైతే ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement
Advertisement