Prabhas : అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. 2017 లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా ఒక సంచలనం. ఇదే సినిమాని కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ డైరెక్టర్. షాహిద్ కపూర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా కబీర్ సింగ్ నిలిచింది. ఇక సందీప్ రెడ్డి వంగ తన మూడో ప్రాజెక్టుగా యానిమల్ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా.. రణబీర్ కపూర్, రష్మిక మందన నటిస్తున్నారు . అయితే ప్రభాస్ తో సందీప్ రెడ్డి రెండేళ్ల క్రితమే స్పిరిట్ చిత్రాన్ని ప్రకటించగా.. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అనౌన్స్ చేసిన స్పిరిట్ సినిమా అసలు సేట పైకి వెళ్తుందా లేదా… ఈ సినిమా ఉందా లేదా అని ఎన్నో అంచనా అనుమానాలు ఈ సినిమాపై క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాపై సందీప్ రెడ్డి వంగ మాట్లాడటంతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ టాపిక్.. ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి స్పిరిట్ పై స్పందించారు.
సందీప్ రెడ్డి మాట్లాడుతూ యానిమల్ సినిమా తరువాత స్పిరిట్ ఉంటుందని.. ప్రభాస్ అన్న అనగానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు అందుకునేలాగా ఈ సినిమా ఉంటుంది. అందుకు కృషి చేస్తాము అని సందీప్ రెడ్డి చెప్పారు. అసలు స్పిరిట్ ఉందా లేదా అనే సందేహాలు ఉండగా.. స్పిరిట్ సినిమాపై ఓ క్లారిటీ అయితే ఇచ్చారు ఈ చిత్ర డైరెక్టర్. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ను మెప్పించే విధంగా స్పిరిట్ ఉంటుందని సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి గా ఉన్నారు.
ప్రభాస్ నటించిన ఆది పురుష్, సలార్ సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. కొన్ని రోజుల తేడాతోనే ఈ సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ సినిమాలు వచ్చే ఆడది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత స్పిరిట్ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.