Prabhas : ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ప్రభాస్ ఫ్యాన్స్ కి నిద్ర పట్టట్లేదు — దిమ్మతిరిగే బ్రేకింగ్ న్యూస్ మరి !

Prabhas :  బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత ప్రభాస్ చేస్తున్నవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే మరో సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదని జ్వరం వచ్చినట్లు వర్గాల విశ్వసనీయ సమాచారం.

prabhas-sick-fans-are-worried
prabhas-sick-fans-are-worried

ప్రభాస్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నారట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభాస్ రాజా డీలక్స్ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాది మొదలైంది. మొదటి షెడ్యుల్ కూడా షూటింగ్ కంప్లీట్ అయింది.

తాజా షెడ్యూల్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ సడన్ గా ప్రభాస్ కి జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రభాస్ కండిషన్ నార్మల్ గా లేనిదని కూడా వినిపిస్తోంది. దాంతో ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రభాస్ త్వరగా కోలుకోవాలని పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్లో పాల్గొవాలని ఆకాంక్షిస్తున్నారు..

రాజా డీలక్స్ కోసం పాతకాలం థియేటర్ని తలపించిన ఓ భారీ సెట్ వేశారట. అందులో ప్రభాస్ తో పాటు మరి కొంతమంది ఈ షూటింగ్లో పాల్గొన్నారని సమాచారం. ఈ చిత్రం హారర్ కామెడీ మూవీ అనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ తరహా చిత్రాలు ప్రభాస్ కి సెట్ అవుతాయి అనే సందేహాలు కూడా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డీలక్స్ రాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు అని సమాచారం.

ఈ చిత్రం గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకుండానే ప్రభాస్ స్టార్ట్ చేయడం మరో హైలెట్.. నిజానికి ఈ ప్రాజెక్టు పై ఫాన్స్ లో ఆసక్తి లేదు.. పైగా ఆసహనం ఉంది. కొత్త దర్శకులతో చేసిన సాహో, రాధే శ్యామ్ చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో మారుతి తో ప్రభాస్ చేయడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభాస్ నుండి రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. జూన్ 16న ఆది పురుష్, సెప్టెంబర్ 28న సలార్ థియేటర్స్ లో విడుదల కానున్నాయి.. ప్రాజెక్టు కే వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.