Prabhas : ఎవ్వరికీ చెప్పకుండా ‘ ఆ పని ‘ చేస్తున్న ప్రభాస్.. ఫ్యాన్స్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.!

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే వంటి పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు.. ఈ సినిమాలతో పాటు మరో పాన్ ఇండియా సినిమా స్పిరిట్ కూడా అతని లైన్ అప్ లో ఉంది.. ఈ సినిమాల తో పాటు ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది.. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంతవరకు అప్డేట్ లేదు.. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!

Advertisement
Prabhas secretly attend shooting in Maruthi movie
Prabhas secretly attend shooting in Maruthi movie

అదేంటంటే మారుతి ప్రభాస్ దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్ ఆల్రెడీ సెట్స్ పైన ఉందని.. సైలెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుందని టాక్ వినిపిస్తోంది.. ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో గప్ చుప్ గా చిత్రీకరణ జరుగుతోందని.. ఈ బుధవారం నుంచి ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.. ఈ షెడ్యూల్లో ప్రభాస్ రెగ్యులర్స్ సీన్స్ షూటింగ్ జరగబోతుందని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.. అయితే ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట.. అయితే ఆ విషయం తెలుసుకున్న డైరెక్టర్ మారుతి వెంటనే ఆ అప్లోడర్ చేత ఆ ఫోటోను డిలీట్ చేయించినట్లు తెలుస్తోంది.. ఇదంతా క్షణాల్లో జరిగినట్లు సమాచారం.. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ వెంటనే ఆ ఫోటోని వైరల్ చేశారు.. ప్రభాస్ ఎవ్వరికీ చెప్పకుండా మారుతీ సినిమాలో షూటింగ్లో పాల్గొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అభిమానులకి.. దీనిని బట్టి చూస్తుంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమా సీక్రెట్ గా సెట్స్ పైకి ఎక్కించేసి.. పట్టుబడిన కూడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం..

Advertisement

మారుతి ప్రభాస్ కాంబినేషన్లో రానున్న పాన్ ఇండియా చిత్రం.. ఇది ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటించనున్నారని.. అలాగే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని.. అందులో ఒకరు మాళవిక మరొకరు నిధి అగర్వాల్ తో పాటు మరో హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.. ఈ చిత్రంలో సంజయ్ దత్, బొమన్ ఇరానీ వంటి బాలీవుడ్ అగ్ర నాయకులూ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఈ సినిమా ను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఈ చిత్రంలోని నటీనటుల గురించి వెల్లడించే అవకాశం ఉంది.. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో సినిమా అంటే ముందుగా ప్రభాస్ ఫాన్స్ చాలా కంగారుపడ్డారు.. కానీ ప్రభాస్ మారుతీపై కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఖచ్చితంగా ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు .. అయితే మరి ఎందుకు ఈ సినిమా షూటింగ్ చాలా సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారు అనేది మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది అని తెలుస్తోంది..

Advertisement