Prabhas : బాలయ్య సమక్షం లో అనుష్క తో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన ప్రభాస్ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్ స్టాపబుల్ షో మొదటి ప్రోమో విడుదలవ్వగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలను సంధించారు. ప్రభాస్ పెళ్లి గురించీ ఆరా తీశారు.. అందులో భాగంగా ప్రభాస్ అనుష్క పెళ్లి డేట్ ఎప్పుడో చెప్పించినట్టు తెలుస్తోంది..

Advertisement

Advertisement

ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఆకట్టుకుంది. చాలామంది అభిమానులు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తోన్నారు.. ఇంతకు పెళ్లి ఉందా లేదా ఏంటసలు? అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. రాసిపెట్టి లేదేమో అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. దీనికి కౌంటర్‌గా బాలకృష్ణ మీ అమ్మకు చెప్పిన సమాధానం నాకు చెప్పకయ్యా అంటూ చెప్పారు.. అప్పుడే నువ్వు అనుష్క ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. మరి మీ ఇద్దరి పెళ్లెప్పుడు అని అడగగా.. మరి మీరు ఇలా డైరెక్ట్ గా అడిగేస్తే సమాధానం చెప్పలేదు సార్.. కచ్చితంగా మా ఇద్దరికీ పెళ్లి అవుతుంది అన్నట్టుగా ప్రభాస్ బాలకృష్ణ కు హింట్ ఇచ్చినట్లు సమాచారం. రేపే బాహుబలి ది బిగినింగ్ ఎపిసోడ్ విడుదల కానుంది ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ అనుష్క కు సంబంధించిన స్పెషల్ టాక్ అందర్నీ ఇంప్రెస్ చేస్తుందని సమాచారం.

Advertisement