Prabhas : ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేయలేక నా వల్ల కాదు అనేసిన షారూఖ్ – ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసే న్యూస్ ఇది .. !!

Prabhas : బాలీవుడ్ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం పఠాన్..జనవరి 25వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. రెండు సంవత్సరాలుగా బాలీవుడ్ పరిశ్రమ వెలవెలబోతుండగా.. షారుక్ పఠాన్ సినిమాతో తిరిగి గాడిలోకి తీసుకొచ్చారు. నార్త్ , సౌత్ అనే తేడా లేకుండా ఈ సినిమా సంచలన విజయం సృష్టించి.. ఓవర్సీస్ లో కూడా వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చాలాకాలం తర్వాత ఇండియన్ సినిమాను చూడడానికి ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టారు.

Prabhas records on intresting comments on sharukh Khan
Prabhas records on intresting comments on sharukh Khan

ఈ క్రమంలోనే ఈ సినిమా బాహుబలి 2 రికార్డును బద్దలు కొడుతుందని అందరూ భావించారు. అంతేకాదు ప్రభాస్ సెట్ చేసిన రికార్డును బ్రేక్ చేసి దూసుకెళ్తుందని అనుకోగా.. అంతా తారుమారయింది. మొదటి వారంలో పది మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో వారంలో గణనీయంగా తగ్గింది. 18 మిలియన్ డాలర్లు కంటే తక్కువ వసూళ్లతోనే సినిమా కలెక్షన్స్ ముగియనున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో బాహుబలి 2 20 మిలియన్ డాలర్లు వసూలు చేయగా పఠాన్ దాన్ని అందుకోలేకపోయింది.

 

ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డును షారుక్ నావల్ల కాదు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. నిజం చెప్పాలి అంటే ప్రభాస్ అభిమానులకు ఇది కాలర్ ఎగరేసే గుడ్ న్యూస్ అని చెప్పడంలో సందేహం లేదు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించగా.. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ప్రతి సినిమాకి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసే దీపికా ఈ సినిమా కోసం రూ.15 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమాతో షారుఖ్.. ప్రభాస్ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు.