Prabhas : ప్రభాస్ పంట పండింది గా .. అనుష్క ని మించిన బ్యూటీ దొరికింది .. తాళి కట్టడమే లేటు !

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్.. అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా.. మేం ఫ్రెండ్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు.. అయితే ప్రభాస్ తో ఎవరో ఒకరితో సెట్ అయ్యేవరకు ఇలాంటి గాసిప్స్ రావడం షరా మామూలే.. ఇప్పుడు అలాంటి వార్తే మరొకటి పుట్టించారు మన సోషల్ మీడియా రాయుళ్లు..!

Prabhas Raja deluxe movie third heroine intresting matters
Prabhas Raja deluxe movie third heroine intresting matters

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఆ తర్వాత తను తీసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయినా కానీ ప్రభాస్ క్రేజ్ రవ్వంత కూడా తగ్గలేదు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే వంటి భారీ ప్రాజెక్టులను చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎవ్వరూ ఊహించిన విధంగా ప్రభాస్ మారుతితో ఓ సినిమాకు కమిటీ అయ్యాడు. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎప్పటికీ అఫీషియల్ ప్రకటన రాకపోయినా కానీ ఆల్రెడీ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందని.. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుందని. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ముందు నుంచే ప్రచారం జరుగుతుంది. కాగా మొదటి హీరోయిన్ మాళవిక మోహన్.. రెండో హీరోయిన్ గా ఆశిక రంగనాథన్.. మూడవ బ్యూటీగా మెహరీన్ అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ రాజా డీలక్స్ లో రాధే శ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన రిద్దీ కుమార్ ను ఈ సినిమాలో మూడవ హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడట ప్రభాస్. పేరు ఫేమ్ లేని ఈ చిన్న హీరోయిన్ ని ప్రభాస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ అంతా గుసగుసలు ఆడుకుంటున్నారు. బహుశా ప్రభాస్ ఈ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడేమో.. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమో అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. కానీ ఏ మాట కామటే ఈ అమ్మడు కూడా బాగుంది.. ప్రభాస్ పంట పండిందిగా.. అనుష్క ని మించిన బ్యూటీ దొరికింది.. తాళి కట్టడమే లేటు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.