Prabhas – Rajamouli : ప్రభాస్ చేసిన చెత్త పనికి రాజమౌళి కి దారుణ అవమానం

Prabhas – Rajamouli :  పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి ఆయన చాలా మొహమాటస్తుడు. సోషల్ మీడియా లో ఎప్పుడూ కనిపించని ప్రభాస్ మీడియా ముందుకు రావడానికి వారితో ఇంట్రాక్ట్ అవ్వడానికి కూడా ఇబ్బంది అవుపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జనాలతో కూడిన షార్ట్స్ చేయడానికి ఒకింత బెరుకుగా ఫీల్ అయ్యేవాడు. పబ్లిక్ లో నటించడానికి సిగ్గుపడతాడు. ముఖ్యంగా చక్రం సినిమాలో ప్రభాస్ ఒక సన్నివేశంలో థర్డ్ జెండర్ గా నటించాలి. అది కూడా వీధిలో ఇక ఈ సన్నివేశంలో నటించడానికి ఆయన అవస్థలు అంతా ఇంతా కాదట. వీలైతే కృష్ణవంశీని సీన్ మార్చేయమని కూడా అడిగారట.. కానీ తప్పదు అనడంతో ఊపిరి బిగ పట్టుకొని ఎలాగోలా షాట్ పూర్తి చేశాడట ప్రభాస్.

Prabhas on rajamouli words
Prabhas on rajamouli words

ఒకసారి ఇదే అనుభవం రాజమౌళితో కూడా జరిగిందని సమాచారం. చత్రపతి మూవీ ఇంటర్వెల్ భాగంలో కూడా విలన్ ని చంపిన ప్రభాస్ కోట శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇస్తాడు. అనంతరం బయట గుంపుగా నిల్చని ఉన్న జనాలను ఉద్దేశిస్తూ ఆవేశంగా డైలాగ్ చెప్పాలి. రాత్రివేళ వర్షం ఎఫెక్ట్ ..చలిలో ఆ డైలాగు చెప్పడానికి ప్రభాస్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడట. దాంతో రాజమౌళిని ప్రభాస్ రిక్వెస్ట్ చేశాడట. నేను చిన్నగా డైలాగ్ చెప్తాను బిగ్గరగా చెప్పలేనని కూడా అన్నాడట. ప్రభాస్ చిన్నగా డైలాగ్ చెప్తుంటే జూనియర్ ఆర్టిస్టులు అందరూ రిహార్సల్ అనుకున్నారట కానీ రాజమౌళి షార్ట్ ఓకే చేసేసారు . ఇక మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ షూటింగ్లో కూడా ప్రభాస్ ఇదే పరిస్థితి ఎదురయిందట..

పెద్దగా డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడ్డాడట.. ఆ సీన్ లో నటిస్తున్న లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ ప్రభాస్ మీద ఒకింత అసహనం వ్యక్తం చేశారట . ఇలాగైతే ఎలాగయ్యా డైలాగు ఓపెన్ గా చెప్పాలి సిగ్గుపడితే ఎలా అన్నారట కే విశ్వనాథ్. ఒకరకంగా ప్రభాస్ ఇలా తయారవడానికి కారణం రాజమౌళి అని కొందరు దర్శకులు తిట్టుకునే వారట. ఇక ఈ విషయాన్ని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపాడు.