Prabhas : ప్రభాస్ ఈ సినిమా ఎన్ని వేల స్క్రీన్స్ పై రిలీజ్ కానుందంటే..!?

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.. ప్రభాస్, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “ఆదిపురుష్”.. రామాయణ కావ్యం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు బాలీవుడ్ తో పాటు ఇటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది.

Advertisement

ఈ చిత్రంతో ప్రభాస్ ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు నిర్మాతలు. మరోవైపు రెబల్ స్టార్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాతో ప్రభాస్ రెమ్యూనరేషన్ 100 కోట్ల తో పాటు సినిమా థియేట్రికల్ బిజినెస్ పై పది శాతం షేర్ తీసుకోనున్నారని టాక్. దాంతో ఈ సినిమాను చాలా ఎక్కువ స్క్రీన్స్ పై రిలీజ్ చేయాలని కసరత్తులు చేస్తున్నారు మేకర్స్.ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే సమయంలో 15 దేశీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Prabhas movie been released on thousands of screens
Prabhas movie been released on thousands of screens

కేవలం భారతదేశం లోనే కాకుండా మిగతా దేశాలలో కూడా కలిపి ఏకంగా 20,000 స్క్రీన్స్ పై ఆదిపురుష్ చిత్రాన్ని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఇక ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ ను దాటేసి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లిపోవడం ఖాయం. దాంతో ప్రభాస్ రెమ్యునరేషన్ 150 కోట్లకు చేరుకోవడం పక్కా. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Advertisement