Prabhas : ప్రభాస్ సంస్థ మీద అధికారుల దాడులు .. నేరుగా అమిత్ షా ని కలవబోతోన్న ప్రభాస్ !

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.. ప్రభాస్ సంహిత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ గురించి తెలిసిందే.. టాలీవుడ్ లో ఉన్న భారీ నిర్మాణ సంస్థల్లో ప్రభాస్ సహభాగస్వామిగా వ్యవహరిస్తున్న యువి క్రియేషన్స్ కూడా ఒకటి.. గత కొంతకాలంగా ప్రభాస్ తో పాటు పలు టాప్ హీరోల సినిమాలను నిర్మిస్తోంది.. అయితే టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన యువి క్రియేషన్స్ సంస్థ మీద జిఎస్టి అధికారులు రైడ్ చేసిన విషయం ఫిలింనగర్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఈ సంస్థపై దాడులు జరిగిన విషయం ఇప్పుడు సంచలనగా మారింది..!

Advertisement
Prabhas meets amith sha on GST issue
Prabhas meets amith sha on GST issue

యువి క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు జిఎస్టి అధికారులు భావిస్తూన్నారు . మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల మీద తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.. సినిమాలు విడుదల చేసిన సమయంలో పన్ను ఏదైనా ఎగావేశారా.. అనే విషయం మీద అధికారులు సోదాలు చేసి ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతుంది.. యువి క్రియేషన్స్ ఆఫీసులో జిఎస్టి విభాగం సోదాలు నిర్వహించడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది.. యువి క్రియేషన్స్ కి వస్తున్న ఆదాయానికి చెల్లిస్తున్న జీఎస్టీ లెక్కలకు చాలా వ్యత్యాసం ఉందని జిఎస్టి విభాగం అధికారులు ఆరోపించినట్లు తెలుస్తోంది. జరిగిన తనిఖీలలో ఒక నిర్ధారణకు వచ్చారాని తెలిసింది..

Advertisement

హైదరాబాద్ కాపూరి హిల్స్ లో ఉన్న యువి క్రియేషన్స్ ఆఫీస్ లో సోదాలు నిర్వహించారు.. మంగళవారం రాత్రి వరకు జరిగిన సోదాల్లో ఆరు కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు ఉన్నట్లుగా అధికారులు ప్రాథమికంగా తేల్చారు.. అంతేకాదు యువి క్రియేషన్స్ సంస్థకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారని కూడా తెలిసింది.. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ తో పాటు కృష్ణారెడ్డి అనే స్నేహితులు కూడా దీనిని నిర్వహిస్తున్నాడు.. ఈ సంస్థ లో మిర్చి నుంచి రాధే శ్యామ్ వరకు ప్రభాస్ మూడు భారీ ప్రాజెక్టులు చేశారు.. 2013లో స్థాపించిన ఈ సంస్థ ప్రభాస్ హీరోగా మిర్చి అనే సినిమా తీశారు.. ఆ తరువాత పలు హీరోలతో ఈ సంస్థ సినిమాలను నిర్మించింది..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ అమిత్ షా ను కలవబోతున్నారు అని తెలుస్తోంది.. జిఎస్టి సరిగ్గా కడుతున్న కూడా జీఎస్టీ ఆఫీసర్స్ దాడి చేయడం ఏంటి అని అడగడానికి ప్రభాస్ అమిత్ షా దగ్గరకు వెళ్తున్నట్టు సమాచారం.. ప్రభాస్ పన్ను కట్టినా కూడా ఎందుకు సోదాలు చేయడానికి వచ్చారని.. ఆ విషయం గురించి చర్చించేందుకు బిజెపి అధ్యక్షులు ప్రభాస్ కలవనున్నారని తెలుస్తోంది.. ప్రభాస్ కు అమిత్ షా కు మంచి పరిచయాలు ఉన్నాయి..

Advertisement