BREAKING : Prabhas టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ కూడా ఒకరు.. ఇటీవల శర్వానంద్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య శర్వాని పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా.. ప్రభాస్ పెళ్లి తర్వాత అని సరదాగా బదులిచ్చాడు.. అయితే ఇటీవల శర్వానంద్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

హైదరాబాద్లో ప్రముఖ స్టార్ హోటల్లో సినీ ప్రముఖులు వీరి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఆ ఫోటోలు చూసిన చాలామంది ప్రభాస్ అభిమానులు చివరకు శర్వానంద్ పెళ్లి కూడా అవుతుంది. నీ పెళ్లి ఎప్పుడు అన్నా అంటూ ప్రభాస్ హ్యష్ ట్యాగ్ తో పాటు మరికొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో ప్రభాస్ ని ప్రశ్నిస్తున్నారు.. ఆ మధ్య ప్రభాస్ పెళ్లి తర్వాత తన పెళ్లి ఉంటుందని అన్న శర్వానంద్ కూడా పెళ్లి పీటలు ఎక్కేసాడు..
ప్రభాస్ పెళ్లి చేసుకోకుండానే శర్వానంద్ పెళ్లి చేసుకుని ప్రభాస్ కి నమ్మక ద్రోహం చేశాడు అంటూ కొందరు సరదాగా శర్వానంద్ పై కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి ఇంతమంది పెళ్లి పీటలు ఎక్కినా కూడా ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.. ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మాదిరిగా ప్రభాస్ కూడా బ్యాచిలర్ గానే ఉండిపోతాడు అంటే అంటూ కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ప్రభాస్ పెళ్లికి సంబంధించిన అప్డేట్ త్వరలోనే రానుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం తన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసిన తర్వాత.. ప్రభాస్ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని.. వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.