Prabhas : కృష్ణంరాజు పెద్ద కార్యక్రమం – ప్రభాస్ ఎంత మందికి అన్నదానం చేస్తున్నాడో తెలుసా.. వామ్మో ఇదెక్కడి మంచితనం సామి… !

Prabhas : ప్రభాస్ కి పెద్ద దిక్కు పెద్దనాన్న కృష్ణంరాజు.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు కూడా ప్రభాసే.. వీరు రెండు కుటుంబాలకు కూడా కృష్ణంరాజే పెద్దదిక్కు.. అలాంటి ఆయన ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.. దాంతో ప్రభాస్ కృష్ణంరాజు ఫ్యామిలీలు షాక్ లోకి వెళ్ళాలి.. టాలీవుడ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభాస్ ని ఫ్యామిలీని ఓదార్చుతున్నాయి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కృష్ణంరాజు ఫ్యామిలీతో పాటు ప్రభాస్ ని కూడా కలిసి పరామర్శించారు..!! అన్నింటికీ పెద్దదిక్కుగా ఉన్న కృష్ణంరాజు మరణించడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి..

ఇప్పట్లో వారు కోలుకోలేని పరిస్థితి నెలకొంది.. కృష్ణంరాజుకి ముగ్గురు కూతుర్లు, భార్య శ్యామలాదేవి ఉన్నారు.. వాళ్లంతా ఒంటరి వారైన ఇలాంటి సమయంలో వాళ్లకి అండగా నిలవల్సిన అవసరం బాధ్యత ప్రభాస్ పైన ఉంది.. ఇంట్లో వాళ్లందరి పరిస్థితి చూసి ఇలాంటి కష్ట సమయంలో వాళ్ళందరికీ అండగా నిలవాల్సిందేనని ప్రభాస్ ఓ అభిప్రాయానికి వచ్చారట.. దాంతో మూడు నెలల పాటు తను నటిస్తున్న సినిమాలన్నింటినీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.. ప్రభాస్ వీళ్ళందరి నీ సెట్ చేసేంతవరకు సినిమా షూటింగ్లకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారట.. ఇప్పుడు ఫ్యామిలీకి టైం ఇవ్వాలని.. వారిలో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యతను తనే తీసుకున్నారట.

Prabhas many people is giving food to Krishnam Raju Funeral 
Prabhas many people is giving food to Krishnam Raju Funeral

ఇంట్లో ఈ లోపు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని తనే అన్ని పనులు చూసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నారట.. అంతేకాకుండా పెద్దనాన్న కృష్ణంరాజు పెద్ద కార్యక్రమం రోజున ప్రభాస్ అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారట.. ఆ రోజు పెద్దనాన్న పేరు మీద ఏకంగా ప్రభాస్ 10 లక్షల మందికి అన్నదానం జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని.. అది తనకు తన పెదనాన్న మీద ఉన్న ప్రేమని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కానీ స్పష్టత కానీ రాలేదు.. అయితే ప్రభాస్ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు.. అలాంటిది వాళ్ల పెద్దనాన్న పెద్ద కార్యక్రమం రోజున ఇంత మందికి అన్నదానం చేయడం మంచిదని.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభాస్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది..