Prabhas : అరుదైన రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషి.!

Prabhas : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన నటనతో మేనరిజంతో ప్రేక్షకులను అలరించిన ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అరుదైన రికార్డును ప్రభాస్ సృష్టించారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..

prabhas fans shocked about his loan
prabhas fans shocked about his loan

అసలు విషయం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు. వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంతో చాలామంది హీరోలు తడబడ్డారు.. అందుకే ఎప్పటికప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం చర్చకు వస్తూనే ఉంది. ఓర్మ్యాక్స్ సర్వే ఫలితాలు కూడా తాజాగా వెల్లడి కాగా అందులో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో నిలిచినట్లు సమాచారం..

జూనియర్ ఎన్టీఆర్ రెండవ స్థానం, రామ్ చరణ్ మూడవ స్థానం , అల్లు అర్జున్ 4 స్థానాలలో ఉన్నారట. అయితే ఈ జాబితాలో ఐదవ స్థానంలో మహేష్ బాబు, ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం నిజానికి ఈ సర్వే ఫలితాలు ప్రతినెల వెళ్లడవుతూ ఉంటాయి .. కానీ వీటిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సర్వే ఫలితాలు జన్యున్ గా ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. ఓర్మాక్స్ మీడియా ఫలితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి..

అంతేకాదు రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలే ఈ జాబితాలో మంచి స్థానాలలో నిలుస్తున్నారని.. అందుకే టాలీవుడ్ నెంబర్వన్ స్టార్ హీరో బాహుబలి అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.