Prabhas : రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరికి కపిలి గట్టి ఝలక్ ఇచ్చిన ప్రభాస్.!

Prabhas : బాహుబలి 2 చిత్రాన్ని ఎండ్ టైటిల్స్ పడే వరకు చూసిన ప్రేక్షకులకు తప్పకుండా బాహుబలి 3 కూడా ఉంటుందని సందేహం రాక మానదు. రాజమౌళి బాహుబలి సిరీస్ లో రెండో భాగమే ఆఖరి చిత్రమని చెప్పినా కూడా.. ఆఖరిలో తనికెళ్ల భరణికి చిన్న కుర్రాడికి మధ్య నడిపినా చిన్నపాటి సంభాషణతో ఆయన మూడవ పార్ట్ తీస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.. ఇక అదే విషయాన్ని రాజమౌళిని ప్రశ్నించగా.. సినిమాకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఏదో ఒక సినిమా చేస్తే అది భావ్యం అనిపించుకోదు కానీ.. ఎవరికి తెలుసు ఒకవేళ మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ అనువైన కథను సిద్ధం చేస్తే మూడవ భాగం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని.. లండన్ టూర్ లో ఉన్నప్పుడు రాజమౌళి చెప్పారు.. దాన్నిబట్టి చూస్తే రాజమౌళి బాహుబలి పార్ట్ 3 చేయడానికి బలంగా ఉన్నారని అప్పట్లో ప్రచారం జోరుగా జరిగింది.. ఇప్పుడు బాహుబలి పార్ట్ 3 కథ చెప్పడానికి రాజమౌళి విజయేంద్రప్రసాద్ ప్రభాస్ దగ్గరికి వెళ్తే.. ఊహించని రియాక్షన్ ఇచ్చాడట ప్రభాస్..!

Advertisement
Prabhas jhalak to Vijayendra Prasad and rajamouli on bahubali part3
Prabhas jhalak to Vijayendra Prasad and rajamouli on bahubali part3

ప్రభాస్ రాజమౌళి లాంటి వాళ్లను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి.. 2000 కోట్లలకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని అంత సాదాసీదాగా వదిలేయరు.. కాబట్టి ఎక్కడో చోట పట్టుకొని మరో పార్ట్ తో తిరిగి రావాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు అదే ప్రయత్నం చేశారట విజయేంద్ర ప్రసాద్.. బాహుబలి పార్ట్ 3 కి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన స్టోరీ సిద్ధం చేసి రాజమౌళికి వినిపిస్తే.. ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేసారట.. ఇక ఈ విషయాన్ని ప్రభాస్ తో కలిసి చర్చించి ఆ తర్వాత స్క్రిప్ట్ రాసుకోమని రాజమౌళి వాళ్ళ నాన్నతో అన్నారట.. ఇక విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ఇద్దరూ కలిసి ప్రభాస్ కి పార్ట్ 3 కథ చెప్పడానికి వెళ్లారట..

Advertisement

అయితే ప్రభాస్ వాళ్ళిద్దరూ చెప్పే కథను కూడా వినకుండా వెంటనే నో చెప్పేసాడట.. బాహుబలి పార్ట్ 3 నేను ఇప్పుడప్పుడే చేయలేనని.. నాకు చాలా సమయం పడుతుందని.. పైగా నా చేతిలో చాలా సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయని.. ఆ తరువాత మా చెల్లెల్ల పెళ్లిళ్లు చేయాలని.. ఆ తరువాత నేను కూడా పెళ్లి చేసుకోవాలంటున్నానని.. ఈ మధ్యలో బాహుబలి పార్ట్ 3 అనేది కుదరదని రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మొహం మీద నో చెప్పేశాడట ప్రభాస్.. ఈ ఒక్క మాట తో ప్రభాస్ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరికి కపిలి గట్టి ఝలక్ ఇచ్చాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవమేంతుందో తెలియాలి.

Advertisement