Prabhas : సొంతూరు మొగల్తూరు లో అడుగు పెట్టగానే.. ప్రభాస్ చేసిన మొట్టమొదటి పని ఇదే..!!

Prabhas : కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన మృతి పట్ల కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతికి గురైంది.. ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రభాస్ ఫ్యామిలీని కలిసి సంతాపం తెలియజేశారు.. కృష్ణంరాజుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని పలువురు సినీ ప్రముఖులు ఎంతో బాధపడ్డారు.. కృష్ణంరాజు పెద్ద కార్యక్రమం దగ్గర పడుతుండడంతో ప్రభాస్ అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన సొంత ఊరు మొగల్తూరు కు వెళ్లారట..! రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణంరాజు పెద్ద కార్యక్రమాలను నిర్వహించడానికి తన సొంత ఊరు వెళ్లాడట..

తన సొంత ఊరు మొగల్తూరులోకి వెళ్ళగానే ప్రభాస్ ముందుగా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా..తన చిన్ననాటి నుంచి పెరిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడట.. ఆ ఇంటిలో వాళ్ళ పెద్దనాన్న కృష్ణంరాజు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ప్రభాస్ బాధపడ్డాడట.. కృష్ణంరాజుకి ప్రభాస్ కి విడదీయరాని బంధం ఉంది.. ఇద్దరి ఆలోచనలు ఒకేలాగా ఉంటాయని ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు అంటున్నారట.. కృష్ణంరాజు కి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యతగా ప్రభాస్ కూడా ఉంటాడట.. ఇప్పుడు అదే బాధ్యతలను నిర్వర్తించాలని ప్రభాస్ మూడు నెలల పాటు తన సినిమా షూటింగ్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు.. కృష్ణంరాజు పెద్ద కార్యక్రమం రోజున ప్రభాస్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలుస్తోంది..

Prabhas first work on Mogalthur
Prabhas first work on Mogalthur

ప్రభాస్ తీసుకునే నిర్ణయాలు చూసి ఒక్కొక్కసారి తన పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ఆశ్చర్యపోతుందట. ముందుగా ముగ్గురు చెల్లెళ్ల బాధ్యతను ప్రభాస్ ఇప్పటినుంచి దగ్గరుండి చూసుకోవాలని డిసైడ్ అయ్యాడట. మరోవైపు వీలైనంత త్వరగా వాళ్ళని సెటిల్ చేసి వాళ్లకు పెళ్లిళ్లు చేయాలని ప్రభాస్ అనుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్.. ప్రభాస్ తన సొంతింటి లోకి వెళ్ళినప్పుడు తన పెద్ద నాన్నతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని తన పెద్దమ్మను హత్తుకుని బాధపడినట్లు ప్రభాస్ సన్నిహితులు అనుకుంటున్నారు.. ఎంతైనా ప్రభాస్ కి తన పెద్దనాన్న కృష్ణంరాజు అంటే.. ఇంట్లో అందరికంటే ఎక్కువ ప్రేమ అని తనే స్వయంగా పలు మూవీ ఈవెంట్స్ లో స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆయన అని లోటును ఎవరు భర్తీ చేయలేరు..

Advertisement