BREAKING : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసింది ప్రభాస్ ఎపిసోడ్ను బాహుబలి 1 బాహుబలి 2 రెండు ఎపిసోడ్లుగా విడుదల చేశారు.. ఇటీవల విడుదలైన ఎపిసోడ్ 2 లో బాలయ్య ప్రభాస్ తో నవ్వులు పోయించేలా మాట్లాడారు.. ఇక ప్రభాస్ గురించి కృష్ణంరాజు మాట్లాడిన వీడియోని బాలయ్య ప్లే చేయించాడు.. ఆ వీడియోలో ప్రభాస్ ఎదుగుదల గురించి కృష్ణంరాజు ఎంతగా గర్వపడేవారో అధ్బుతంగా చెప్పారు..
కృష్ణంరాజు తన గురించి గర్వపడుతూ మాట్లాడుతున్న ఆ మాటలు విన్న ప్రభాస్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ పెదనాన్నని ప్రభాస్ గుర్తు చేసుకున్న తీరు అభిమానులతో పాటు పలువురని భావోద్వేగానికి గురిచేస్తోంది. పెద్దనాన్న గురించి బాలకృష్ణ ఏదైనా ఇన్స్పిరేషన్ గా చెప్పమని అడిగితే ఐ లవ్ హిమ్ అంటూ కళ్ళు తుడుచుకున్నారు.. అంత వరకు గోపీచంద్ తో కలిసి బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం చెబుతూ నవ్వులు పూయించారు. కృష్ణంరాజు వీడియో ప్లే చెయ్యగానే ఒక్కసారిగా ప్రభాస్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడంతో బాలయ్యతో పాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.