Prabhas : ప్రభాస్ ఆ సినిమా ప్రమోషన్స్ కి రాడా.!? అదేంటి.!? ఇదేం స్ట్రాటజీ స్వామి.!?

Prabhas : ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆదిపురుష్.. రామాయణాన్ని ఆధారం చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.. గత నెలలో ఈ సినిమా టీజర్ విడుదలైంది. కానీ దానిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ప్రభాస్ లుక్ బాగోలేదని టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోయాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను సంతృప్తి పరిచేందుకు చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement
Prabhas doesn't attend that movie pramotions beacuse
Prabhas doesn’t attend that movie pramotions beacuse

విజువల్ ఎఫెక్ట్స్, సిజి వర్క్స్ లో తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఏకంగా 100 కోట్ల ఖర్చుతో విజువల్ ఎఫెక్ట్స్ షార్ట్స్ ను సరి చేసే ప్రయత్నం చేస్తోందని బాలీవుడ్ నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల అవటానికి ఇంకాస్త సమయం పడుతుందని.. ముందుగా విడుదల చేద్దామనుకున్నా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అని.. బహుశా వచ్చేది సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారని మరొక టాక్.

Advertisement

ఈ సినిమా ప్రమోషన్లలో నేను పాల్గొననని ప్రభాస్ కరాకండిగా చెప్పేసారట. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు ఆ నమ్మకం ఉందని.. అందుకే నేను ఈ సినిమా ప్రమోషన్స్ కి రానని చెప్పారట ప్రభాస్. ఈ సినిమా హిట్ కొట్టి సక్సెస్ మీట్ లో నేను పాల్గొంటాను అని ప్రభాస్ కరాకండిగా ఓం రౌత్ తో చెప్పారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే.. కచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా హిట్ అవుతుందని అర్థమవుతుంది. ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం లేదని తెలిసిన మరి కొంత మంది.. దీనిని ఇదో రకమైన స్ట్రాటజీ అని ప్రభాస్ ను విమర్శిస్తున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement