Prabhas: రెబల్ స్టార్ గా పరిచయమైన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మొదటి హీరో కూడా ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పైగా చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ చేస్తున్నవన్నీ భారీ ప్రాజెక్ట్స్ కావడం హైలెట్. అయితే ఈ మధ్య ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా తన తల మీద బాబా లాగా ఒక క్యాప్ పెట్టుకుని కనిపిస్తున్నాడు. దాంతో అంతా ప్రభాస్ కి బట్టతల వచ్చిందా.!? అందుకే ఆ క్యాప్ పెట్టుకుంటున్నాడా అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

ప్రభాస్ ఇటీవల బయట ఎక్కడ కనిపించినా కూడా తన తల మీద ఓ క్లాత్ క్యాప్ కనిపిస్తోంది.. ఆయనకు ఏమైనా బట్టతల వచ్చిందా.. విగ్గులేని సమయంలో అలా కాపు పెట్టుకొని తిరుగుతున్నాడు అనే సందేహాలు తలెత్తయి. అయితే అలాంటిది ఏమీ లేదని ప్రభాస్ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. దాంతో ఒక్కో సినిమాకు తగ్గట్టు తన హెయిర్ స్టైల్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. అలా బయటకు వచ్చినప్పుడు ఆ హెయిర్ స్టైల్స్ లుక్ రివిల్ అయిపోతుంది. అయితే ఆ లుక్ ని చూసి ప్రభాస్ ఏ సినిమాలో ఇలాంటి లుక్ లో కనిపిస్తాడు ముందుగానే కనిపెట్టేస్తారు ఆయన అభిమానులు. అలా జరగకుండా ఉండాలని ప్రభాస్ కావాలనే తలకు హెయిర్ క్యాప్ పెట్టుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల వారు చెబుతున్నారు.
దీంతో ప్రభాస్కి బట్టతల అంటూ గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలకు కళ్లెం పడింది. ప్రభాస్ హైయిర్ క్యాప్ వెనుక ఉన్న అసలు నిజం బయటకు రావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలలో వరుస షూటింగ్ లలో పాల్గొంటున్నారు.