Prabhas – Balakrishna : బుల్లితెర ప్రేక్షకులు ప్రభాస్ బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. ప్రభాస్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించి గ్లింప్స్ వచ్చేసింది.. ప్రభాస్ క్యూట్ లుక్ లో అదిరిపోయాడు.. ఏం చెబుతున్నావ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ మాట్లాడటం గ్లింప్స్ కే అనిపించింది.. ఇంతకీ ఆ మాట ప్రభాస్ ను ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చగా మారింది.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొట్టమొదటిసారి ఓ టాక్ షో కి రావడం.. అది కూడా నందమూరి నరసింహ బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి రావడం సెన్సేషన్ గా మారింది.. ఎప్పుడు ఎప్పుడు ఈ ఎపిసోడ్ రిలీజ్ అవుతుందా.. ప్రభాస్ బాలకృష్ణ ఏం మాట్లాడుకున్నారా అని అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు.. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో ప్రభాస్ అన్న ఓకే ఒక్క మాట.. రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్ అని.. ఈ మాటలు ప్రభాస్ ఎవరి ఉద్దేశించి అన్నారంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అన్నారట..
ప్రభాస్ ను ఫోన్ ఫ్రెండ్ లో ఎవరితో మాట్లాడుతావు అనే సెలక్షన్లో ప్రభాస్ చేతిలో ఉన్న నీడిల్ వెళ్లి రామ్ చరణ్ ఫేస్ మీద పడుతుందట. ఇక ప్రభాస్ రామ్ చరణ్ తో మాట్లాడుతుండగా.. రామ్ చరణ్ ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పేస్తారట.. అప్పుడే ప్రభాస్ నవ్వుతూ రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా డార్లింగ్ బయటికి వచ్చాక నీకు ఉందే అన్నట్టుగా.. ప్రభాస్ నవ్వుతూ మాట్లాడటం ఆ షో మొత్తానికే హైలెట్ సీన్ అని.. ఆ షో కి వెళ్లిన ఒక అభిమాని యూట్యూబ్ లో చెప్పడం వైరల్ గా మారింది. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ రిలీజ్ అవుతుందని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.