Prabhas-Anushka : ప్రభాస్ తో పెళ్లి గురించి తన పేరెంట్స్ చివరఖరుగా అడిగితే అనుష్క సమాధానం ఇదే..!

Prabhas-Anushka : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరంటే టక్కున చెప్పే పేర్లలో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క పేర్లు కూడా ఆ లిస్టులో ముందు వరుసలో ఉంటాయి.. వీళ్ళిద్దరూ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఆఫ్ కోర్స్ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని టాక్ ఎప్పటినుంచో వినిపిస్తుంది.. అయితే ప్రభాస్ ఈ దీపావళికి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఓ న్యూస్ వినిపిస్తోంది.. అయితే అనుష్క వెంటనే ఒకే చెప్పేసిందా అంటే లేదనే చెప్పాలి..! అదేంటి అంటారా.!?

Advertisement
Prabhas Anusha marriage just Hold on her because
Prabhas Anusha marriage just Hold on her because

ప్రభాస్ కుటుంబానికి అనుష్క చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే.. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు హాస్పటల్లో ఉన్నప్పుడు కూడా స్వీటీ స్వయంగా వెళ్లి కృష్ణంరాజును పరామర్శించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఆయన మరణించినప్పుడు కూడా అనుష్క కృష్ణంరాజు తనని దగ్గరకు తీసుకుంటున్న ఫోటో షేర్ చేసి.. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెబుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించింది.. పెద్దాయన కృష్ణంరాజు కూడా ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని అప్పట్లో వార్తలు వినిపించాయి.. అయితే ప్రభాస్ తాజాగా అనుష్కతో పెళ్లికి ఒప్పుకున్నాడట..

Advertisement

ఇక ఇదే విషయాన్ని స్వీటీ వాళ్ళ ఇంట్లో తనని కూడా అడిగి కన్ఫర్మేషన్ తీసుకుందామని అడగగా.. అనుష్క మాత్రం వెంటనే నో అని చెప్పేసిందట.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనని చెప్పాలి.. ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పటికే ప్రభాస్ నటించిన సాహో , రాధే శ్యామ్ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అయితే అందుకోలేదు.. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K మూడు సినిమాలు తన చేతిలో ఉన్నాయి.. ఈ మూడు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యేవరకు ప్రభాస్ పెళ్లి జోలికి రాకుండా ఉండటమే మంచిది అని స్వీటీ అనుకుంటుందట.. అందుకే ఈ మూడు సినిమాలు షూటింగ్ అయిన తర్వాత మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటామని అనుష్క తన కుటుంబ సభ్యులతో చెప్పిందట.. ప్రభాస్ మంచి కోసమే స్వీటీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందట.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Advertisement