Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతి నిండా భారీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే.. ఆదిపురుష్ గత కొన్ని రోజులుగా వాయిదా పడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతూ ఉండగా.. ఇక ఆ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ వాటిపై స్పందించారు. ఆదిపురుష్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ దెబ్బలో నుంచి కోలుకోకముందే.. మరో సినిమా కూడా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది..!
ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కే వంటి బిగ్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆదిపురుష్ జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. అయితే 2023 జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ సలార్ పైనే ఉంది. అయితే ఇప్పుడు సలార్ సినిమా కూడా వాయిదా వేస్తున్నారని అంటున్నారు. సలార్ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆదిపురుష్ సినిమా వాయిదా పడటంతో ఈ చిత్రం కూడా వాయిదా పడే అవకాశం ఉంది. కేవలం మూడు నెలల వ్యవధిలో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ మేకర్స్ కోరుకోవడం లేదు.
దీంతో ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతుందని అంతా అంచనాలు వేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా వాయిదా పడటంతోనే ప్రభాస్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అది చాలదన్నట్టు ఇప్పుడు సలార్ కూడా వాయిదా పడుతుందని తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రభాస్ అభిమానుల తో పాటు మూవీ లవర్స్ కూడా ఇది బాడ్ న్యూస్. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఊహించని కృష్ణ సొంతం చేసుకున్నారు. మళ్లీ అలాంటి క్రేజ్ ఆదిపురుష్, సలార్ చిత్రాలతో సొంతమవుతుందని అందరూ ఎదురు చూస్తుంటే.. ఈ సినిమాలు వాయిదా వేస్తున్నట్టు వస్తున్నట్టు మేకర్స్ వరుసగా బ్యాడ్ న్యూస్ లను చెబుతున్నారు..