Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ బాలేదు అన్న వాళ్ళ దవడ పగిలేలా.. నెల రోజుల తరవాత వరల్డ్ రికార్డ్ !

Prabhas Adipurush :  టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్.. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌతు రూపొందిస్తున్నారు.. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ నటిస్తుంది.. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలవగా విపరీతమైన నెగెటివిటీని సొంతం చేస్తుంది.. అయితే ఈ టీజర్ బాలేదు అన్నవారికి గూబ గుయ్యమనే న్యూస్ ఇది..!

Advertisement
prabhas-adipurush World Record After One Month
prabhas-adipurush World Record After One Month

ఈ సినిమా టీజర్ విడుదల అవ్వగా అది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది గూగుల్ లో సెర్చ్ చేసిన టీజర్ గా ఆదిపురుష్ రికార్డు క్రియేట్ చేసింది.. అయితే ఈ టీజర్ విడుదల అయ్యి కేవలం ఒక నెల రోజులు మాత్రమే అయ్యింది. కానీ 30 రోజులుగా గూగుల్ లో అత్యధికంగా నెటిజన్స్ వెతికింది ఆదిపురుష్ గురించేనట.. అన్ని టాపిక్ ల కంటే ఆదిపురుష్ టీజర్ ముందువరుసలో నిలిచింది.. గూగుల్ లో +1850 శాతం రేటింగ్ దీనికి రావడం మరో హైలెట్.. ఆదిపురుష్ టీజర్ గూగుల్ లో టాప్ సెర్చ్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.. ఆదిపురుష్ ఇంకా ముందు ముందుకు వెళ్తుంది.. అది ఎంత పైకి అన్నది ఈ గణాంకాలే చెబుతాయి అంటూ.. గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉన్న ఆదిపురుష్ పోస్టర్ ను ట్వీట్ చేసింది చిత్ర యూనిట్..

Advertisement

నిన్నటి వరకు ఆదిపురుష్ టీజర్ గురించి ఎక్కడ చూసినా విపరీతమైన నెగెటివిటీనే వినిపించింది.. కానీ ఈ విషయంతో ఆ నెగెటివిటీ మొత్తం పోయి పాజిటివ్ టాక్ వస్తుందేమో చూడాలి.. ఇప్పటి వరకు ఈ టీజర్ బాగోలేదు అన్నవారికి ఇది మాత్రం కచ్చితంగా వాళ్ళ చంప చెల్లుమనిపించే న్యూస్ అనే చెప్పొచ్చు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.. ఈలోపు ఈ సినిమాపై సాధ్యమైనంత వరకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలాగా ఈ చిత్ర యూనిట్ ఆ దిశగా అడుగులు వేయాలి..

Advertisement