AAdipurush : ఆదిపురుష్ .. ఆదిపురుష్ … ఆదిపురుష్ .. ఒచేసింది రా ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకలు లాంటి న్యూస్ !

AAdipurush : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ లో ఆది పురుష్ కూడా ఒకటి.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా అప్డేట్ వచ్చేసింది.. ఇక పునకాలే..

Prabhas adipurush release date given clarity on makers
Prabhas adipurush release date given clarity on makers

తాజా సమాచారం ఏమిటంటే.. సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. గతంలో ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా.. విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకుంది.. ఈ సినిమా టీజర్ బాలేదని చిత్ర యూనిట్ విఎఫ్ఎక్స్ మార్చే పనిలో పడ్డారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా టీజర్ పై విమర్శలు రావడంతో విఎఫ్ఎక్స్ మార్చే పనిలో భాగంగా.. ఈ సినిమాని 2023 జూన్ 16న విడుదల చేయాలని భావించారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.

తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈ సినిమా ముందుగా అనుకున్న తేదీకి రిలీజ్ కాదు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా జూన్ 16న రిలీజ్ అవ్వడం ఖాయమని నిర్ధారిస్తూ చిత్రబృందం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రభాస్ ని రాముడిగా చూడాలి అంటే ఇంకో 150 రోజులు కచ్చితంగా ఆగాల్సిందే అని స్పష్టం చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు ఈ సినిమాలో ప్రభాస్ ను రాముడి గా చూసేందుకు ఎదురు చూస్తున్నారు. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా వేసవి వినోదంగా రావడం ఫిక్స్ అని మేకర్స్ అఫిషియల్ క్లారిటీ ఇచ్చారు.