Prabhas : ప్రభాస్ కష్టం అంతా WASTE WASTE WASTE — ఆదిపురుష్ విషయం లో ఫ్యాన్స్ గుక్కపెట్టి ఏడ్చే న్యూస్ !

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆది పురుష్.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ రిలీజ్ చెయ్యగా భారీగా ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నుంచి తప్పిస్తూ జూన్ కి వాయిదా వేశారు. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరోసారి మరింత ఆలస్యం కానున్నాయని తెలుస్తోంది..


ఇండస్ట్రీ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు అనుకున్న దానికంటే కూడా ఆలస్యంగా జరుగుతున్నాయట. ప్రేక్షకులకు మరింత మంచి అనుభూతిని అందించేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఈ సినిమా పై మరో 200 కోట్లు ఖర్చు పెట్టి.. ఆది పురుష్ లోని పలు పాత్రల పై రీ షూట్ చేసారని తెలుస్తోంది.

సోషల్ మీడియా టాక్ ప్రకారం ఇప్పుడు గ్రాఫిక్స్ మార్పులు చేసినా కూడా అంత బాగా రాలేదని తెలుస్తోంది.. అంటే ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన కృషి అంతా వేస్ట్ యేనా అని అభిమానుల వాదన.. ఏ ముహూర్తాన ఆది పురుష్ స్టార్ట్ చేశారో అంతా వెనక్కు తప్ప ముందుకు వెళ్ళడం లేదు.. కానీ ఈ సినిమా తో విజువల్ ట్రీట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుదని ఇన్సైడ్ టాక్.