Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. సలార్ మూవీ బిగ్ అప్డేట్..!

Prabhas : ప్రభాస్ నటించిన భారీ ప్రాజెక్టులో సలార్ చిత్రం కూడా ఒకటి.. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ ప్రభాస్ అభిమానులకు తీపి కబురు అందించారు..

Advertisement
Prabahs salar movie shooting completion update on director
Prabahs salar movie shooting completion update on director

సలార్ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 85 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని.. మిగతా 15 శాతం జనవరిలో పూర్తి చేస్తామని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ కు మరో ఆరు నెలల సమయం కేటాయించామని.. ఈ సినిమాను ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా రషెస్ చూసానని ప్రభాస్, పృధ్విరాజ్ అద్భుతంగా నటించారని.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నానని.. ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటారని ఆయన వివరించారు .. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్నైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.

Advertisement
Advertisement