Poorna : పూర్ణ.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హీరోయిన్గా ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇక అది అలా ఉంటే పూర్ణ ఇటీవల ఓ దుబాయ్ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పూర్ణ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ చిత్రం సువర్ణసుందరి.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పూర్ణ బేబీ బంపుతో మీడియా ముందుకు వచ్చింది..

ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సువర్ణసుందరి.. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో నటి పూర్ణ కూడా పాల్గొన్నారు. తను ప్రెగ్నెన్సీ కంటే ముందే ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా ప్రమోషన్లలో పూర్ణ పాల్గొనక తప్పలేదు. ప్రస్తుతం పూర్ణ తను ముందుగా ఓకే చేసుకున్న ప్రాజెక్ట్ అన్నింటినీ ఫినిష్.. చేసి మ్యారీడ్ లైఫ్ తో పాటు ప్రెగ్నెన్సీ లో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూర్ణ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. అలాగే తనకు పెళ్లి జరిగిన సంగతి.. తను ప్రెగ్నెంట్ అయిన విషయం తను ప్రెగ్నెన్సీలో తీసుకుంటున్న కేర్ వంటి విషయాలను తరచూ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది..
తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈసారి పూర్ణ మేకప్ డోస్ పెంచినట్లుగా అనిపిస్తుంది. లేదంటే ప్రెగ్నెంట్ కావడంతో మరింత అందంగా కనిపిస్తోంది. పూర్ణ కి మంచి బిడ్డ పుట్టారని ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ మా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.