Poorna : పెళ్లి అయ్యి నెల కూడా కాలేదు.. పూర్ణ మరీ ఈ రేంజ్ లో అందాల ఆరబోత??

Poorna : మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే మరొకవైపు టీవీలో ప్రసారమయ్యే వివిధ షోలకు జడ్జిగా చేస్తూ .. మరొకవైపు సోషల్ మీడియాలో కూడా మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది . ఇటీవలే దుబాయ్ కి చెందిన జేబీఎస్ గ్రూప్ అధినేత ప్రముఖ బిజినెస్ మాన్ అయిన షానిధ్ అసిఫ్ అలీ.. ని దుబాయిలో వివాహం చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే వీసాల కారణంగా చాలామందిని వివాహానికి పిలవలేదు అని, కేరళలోనే త్వరలోనే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా పూర్ణ వెల్లడించింది.

Advertisement
Poorna glamour photos goes viral
Poorna glamour photos goes viral

ప్రస్తుతం పూర్ణ అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో , అభినయంతో మరింత ఆకట్టుకుంది. అలా “సీమటపాకాయ్” సినిమా ద్వారా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూర్ణ.. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన “అవును” సినిమాలో నటించి మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డ పూర్ణ అందులో భాగంగానే సిల్లీ ఫెలోస్, దృశ్యం2, అఖండ వంటి చిత్రాలలో నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది.

Advertisement

ఒకవైపు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా పెళ్లి జరిగి నెల కూడా కాలేదు అప్పుడే అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది పూర్ణ . తాజాగా మెరూన్ కలర్ సారీ లో తన అందాలను ఆరబోస్తూ మరింతగా ఆకట్టుకుంటుంది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. వివాహం జరిగినా కూడా ఈమె అందంలో ఏమాత్రం గ్లామర్ తగ్గడం లేదు అంటూ కూడా నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement