Poorna : పూర్ణ ల‌క్ మాములుగా లేదు.. ఆమె భ‌ర్త తాజాగా ఇచ్చిన గిఫ్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేన‌ట‌..!

Poorna : న‌టి పూర్ణ అదృష్టం ఇప్పుడు మాములుగా లేదు. ఒక‌ప్పుడు చిన్న న‌టిగా ఉన్న పూర్ణ బుల్లితెర షోస్ కి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందింది. ఆ క్ర‌మంలో స్టార్ హీరోల సినిమాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ కూడా పోషించింది. ఇక కెరీర్ సాఫీగా సాగుతున్న స‌మ‌యంలో పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిధ్ ఆసిఫ్ అలీ నీ వివాహం చేసుకుంది. ఇటీవ‌ల త‌మ పెళ్లి ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇవి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక త‌న పెళ్లికి భర్త నుంచి సుమారుగా కొన్ని కోట్ల రూపాయల విలువైన గిఫ్టులు పొందింద‌ని కూడా ప్ర‌చారం న‌డుస్తుంది.

poorna-gets-surprising-gift
poorna-gets-surprising-gift

Poorna :  భ‌లే గిఫ్ట్..

పెళ్ళికి ముందే 2700 గ్రాముల బంగారాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చారని, దాని విలువ అక్షరాలా రూ.1.30 కోట్లు అని స‌మాచారం. అలాగే 25 కోట్ల రూపాయల విలువైన ఒక లగ్జరీ హౌస్ ను కూడా ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. ఇవే కాకుండా ఒక మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా పూర్ణ బ‌హుమ‌తులుగా అందుకుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. మొత్తానికి సుమారుగా రూ.30 కోట్ల వరకు విలువైన బ‌హుమ‌తులని ఈ అమ్మ‌డు బ‌హుమ‌తిగా పొందింద‌నే టాక్ న‌డుస్తుంది. ఇక ఇప్పుడు ఆమె భర్త షానిద్ కపూర్ ఇచ్చిన ఫస్ట్ నైట్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

తాజా సమాచారం ప్రకారం పూర్ణ భ‌ర్త ఆమెకి డైమండ్ కాస్ట్లీ రింగును గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ రింగ్ నార్మల్గా చూస్తే పూర్ణ పేరు ఉల్టా చేసి చూస్తే షానిద్ పేర్లు వచ్చేలాఉంద‌ట . ఇది పూర్ణ‌కి ఎంతో న‌చ్చింద‌ని, దానిని ఆమెతో పాటే అట్టి పెట్టుకుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. ప్రస్తుతం ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు పలు టీవీ షోలలో జ‌డ్జిగా వ్యవహరిస్తూ మరింత సందడి చేస్తోంది పూర్ణ‌.