Pawan Kalayan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలలో తన జోరు కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే మరోపక్క ప్రజల్లోకి వెళ్లడానికి ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం ఒక ప్రత్యేకమైన వాహనాన్ని సిద్ధం చేయించారు. అయితే వారాహి పేరుతో సిద్ధం చేయించిన ఈ వెహికల్ మిలిటరీ ఆలివ్ గ్రీన్ కలర్ ఉండడంతో పెద్ద ఎత్తున వైసిపి పార్టీ అధినేతలు రచ్చ రచ్చ చేశారు. మిలిటరీ ఆలివ్ గ్రీన్ కలర్ ప్రైవేట్ వాహనాలకు ఉపయోగించడానికి అనుమతి ఉండదని కూడా కామెంట్లు చేశారు.

కానీ తాజాగా ఈ వాహనానికి తెలంగాణ రోడ్డు రవాణా శాఖ లైన్ క్లియర్ ఇచ్చిందని సమాచారం. తాజాగా ఈ వార్తలపై తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఆలివ్ గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్. అంతేకాదు ఈ వారాహి వాహనానికి TS13EX8384 అనే నెంబర్ ప్లేట్ తో వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా క్లియర్ చేశామని ఆయన స్పష్టం చేశారు. వాహనం బాడీకి సంబంధించి సర్టిఫికెట్ కూడా పరిశీలించామని.. చట్ట ఉల్లంఘన చేసే అంశాలు ఏవి ఇందులో కనపడలేదు అని కూడా వివరణ ఇచ్చారు.