Tollywood News : మెగా మామా అల్లుడి సినిమా కిర్రాక్ అప్డేట్..

Tollywood News : మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లుడు సాయిధ‌ర‌మ్‌ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. వినోధయ‌ సీత‌మ్ రీమేక్‌ లో ఈ ఇద్దరూ నటిస్తుండగా.. మామ అల్లుళ్ళ ఈ రీమేక్ షూటింగ్ ఎప్పుడూ మొద‌లు కానుందంటూ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతుంది..

Pawan Kalyan Vinodhaya Sitham Remake update
Pawan Kalyan Vinodhaya Sitham Remake update

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత భవదీయుడు సినిమాలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలతో పాటుగా తాజాగా వినోధ‌య సీత‌మ్ రీమేక్‌ను కూడా ప‌వ‌న్ సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. జ‌న‌వ‌రిలో ఈ రీమేక్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు కానున్నట్లు టాక్. సంక్రాంతి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌రో హీరోగా న‌టిస్తోన్నాడు.

మామా అల్లుళ్ల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి సినిమా కావ‌డంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్‌ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జీవితంలో బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌కుండా మరణించిన ఓ వ్య‌క్తికి దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తే ఏం జ‌రిగింద‌నే పాయింట్‌తో ఈ సినిమా తెరకక్కుతోంది. ఇందులో దేవుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలిసింది.