Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ అద్దిరిపోయింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు ఈ మెగా హీరో శరవేగంగా షూటింగ్స్ పూర్తి చేస్తున్నాడు. ఇటీవల కాలంలో పవన్ ముంబైలో ఓజీ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓజీ సినిమాకు సంబంధించి పవర్-ప్యాక్డ్, ప్రొడక్టివ్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు నిర్మాత డివివి దానయ్య ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఒక అదిరిపోయే కొత్త లుక్ కూడా పంచుకున్నారు.

ఈ షెడ్యూల్‌లో ప్రకాష్‌రాజ్‌, పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్‌ మోహన్‌లపై కీలక సన్నివేశాలను షూట్ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా, అభిమానులు పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని మళ్లీ చూడగలరని నిర్మాత హామీ ఇచ్చారు. దీంతో PSPK అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా.. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ షెడ్యూల్ పూర్తి చేసిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభించేందుకు పవన్ సిద్ధమవుతున్నాడు.