Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం..!

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్.. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా.. అక్టోబర్ 5న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుందని తెలుస్తుంది.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్  ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో పోషించబోతున్నారు.. ఈ  సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ సినీ అభిమానుల్లో ఉన్నాయి.. కానీ ప్రమోషన్స్  ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో  చిత్ర యూనిట్ ఈ నెలాఖరి లోపు ఒక పెద్ద ఈవెంట్ చేయాలని భావిస్తున్నారు..

ఈ గ్రాండ్ ఈవెంట్ కి మెగా బ్రదర్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పవన్, చిరు ఇద్దరు కలిసి సైరా సినిమా ఈవెంట్ తర్వాత మరెక్కడ కలిసి కనిపించలేదు.. దీంతో ఎన్నో రోజులుగా మెగా  ఫ్యాన్స్ ఆశగా వెయిట్ చేస్తున్న కోరిక త్వరలో తీరబోతుందా అనేది చూడాలి.. ఈవెంట్ కు  సల్మాన్ ఖాన్ ఎలాగో వస్తారు.. పవన్ కళ్యాణ్ ని కూడా పిలిస్తే   మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు తోపాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆనందిస్తారని నిర్మాతలు భావిస్తున్నారు..

Pawan Kalyan helps Chiranjeevi
Pawan Kalyan helps Chiranjeevi

ఈ కాంబినేషన్ లో కలిసి ప్రమోషన్స్ చేస్తే సోషల్ మీడియాలో మీడియాలో సినిమాకి బాగా హైప్ క్రియేట్ అవుతుందని డైరెక్టర్స్ భావిస్తున్నారట.. బాలీవుడ్ ప్రమోషన్స్ కి సల్మాన్ ని ఎలాగో వాడుతారు.. చిరంజీవి గారు సల్మాన్ తో పాటు బిగ్ బి అమితాబ్ కూడా ముంబై ఈవెంట్స్ లో పిలిచి ప్రమోషన్స్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఈవెంట్ లో టీం ప్లాన్ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ సల్మాన్ మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై మూవీ ప్రమోషన్స్ కి వస్తే సోషల్ మీడియాలో ఫొటోస్ తో పాటు మూవీ కూడా బాగా వైరల్ అవుతుంది. ఇదే వేదికపై ట్రైలర్ కూడా రిలీజ్ చేసే సూచనలు ఉన్నట్లు సినీ వర్గాల టాక్.

Advertisement