Pawan Kalyan : చిరంజీవిని పవన్ కళ్యాణ్ సరిగా అర్థం చేసుకోవడం లేదా? ఆందోళనలో అభిమానులు..!

Pawan Kalyan : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా గాడ్ ఫాదర్ చిత్రం .. ఈ రోజున చాలా అంగరంగ వైభవంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి తో పాటూ పవన్ కళ్యాణ్ కూడా నటించారని సమాచారం. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి బాగా యాక్టివ్గానే కనిపించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన తమ్ముడు రాజకీయం పైన స్పందించడం జరిగింది చిరంజీవి.

పవన్ కళ్యాణ్ వంటి నిశ్శబ్దతో ఉన్న నాయకుడు మనకు రావాలి అని నా కోరిక కూడా. అయితే తన మద్దతు మాత్రం ఉంటుందో ఉండదో అని చెప్పలేనని తెలియజేశారు. రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను అని తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ ను అభిమానించే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆయన కుటుంబ సభ్యులు.. పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇతర పార్టీల వైపు మగ్గుచూపి వారితో పొత్తులు కలుపుకోవాలని చూస్తున్నారు.

Pawan Kalyan doesn't understand Chiranjeevi properly
Pawan Kalyan doesn’t understand Chiranjeevi properly

దీంతో మెగా అభిమానుల కోరిక నెరవేరకుండా ఉంటుంది అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇక అంతే కాకుండా చిరంజీవి ఇతర పార్టీలో ఉండడంవల్ల తన తమ్ముడికి నష్టం వస్తుందని ఉద్దేశంతోనే ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు . అయితే తన అన్న ఆశయానికి విరుద్దంగా ఉంటూ పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలతో పొత్తులు కలుపుకోవడం అభిమానులకు మాత్రం నచ్చలేదు. మరి పవన్ కళ్యాణ్ ఇకనైనా తన అన్న ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అయితే బాగుంటుందని కూడా పలువురు పలు రకాలుగా తమ అభిప్రాలను వ్యక్తం చేస్తున్నారు మరి జనసేన పార్టీ ఏ విధంగా తన అధికారాన్ని లెక్కించుకుంటుందో తెలియాల్సి ఉంది.