Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమా రంగంలో విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతూనే మరోపక్క చేతిలో ఉన్న సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ ఫైకి తీసుకురావడం జరిగింది.
వీటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. 2012లో హరీష్ దర్శకత్వంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మళ్లీ ఈ కాంబోలో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” పై అంచనాలు డబల్ అయ్యాయి. ఈ సినిమాలో పవన్ కి జోడిగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ గురించి మూవీ మేకర్స్ తాజాగా కొత్త అప్ డేట్ ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు.. కీలకమైన యాక్షన్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు.. ట్విట్టర్ వేదికగా సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. “ఉస్తాద్ భగత్ సింగ్” లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ కి ప్లస్ అయ్యే డైలాగ్స్ హరీష్ ఓ రేంజ్ లో రాసినట్లు టాక్.