Pavitra Lokesh : ఇంటర్నెట్ లో పవిత్ర పాత ఫోటోలు .. అవి చూసి ఉలిక్కిపడ్డ నరేష్ !

Pavitra Lokesh :కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి చాలా మంది నటీనటులు వచ్చి సెటిల్ అయ్యారు.. అలా వచ్చి హైదరాబాద్ కి మకాం మార్చి.. ఇక్కడే ఉంటూ సొంతంగా ఇల్లు, కార్లు కొనుక్కొని సెటిల్ అయ్యారు. అలా సెటిల్ అయినటువంటి వారిలో కన్నడ ప్రముఖ నటి పవిత్ర లోకేష్ కూడా ఒకరు..  పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో  అందరి స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

Advertisement
Pavitra Lokesh old photos viral on social media naresh reaction
Pavitra Lokesh old photos viral on social media naresh reaction

పవిత్ర లోకేష్ సుమారుగా లక్ష నుంచి 2 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. పవిత్ర తాను నటించిన సినిమాల కంటే పలు కాంట్రవర్సీలతోనే బాగా పాపులర్ అయింది. నటుడు నరేష్ తో ప్రేమ లో పడి తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏకంగా ముద్దుతో ప్రకటించారు. అయితే గతంలో నటుడు నరేష్ కి మూడు పెళ్లిళ్లు అయినప్పటికీ పలు వ్యక్తిగత కారణాలవల్ల తన ముగ్గురు భార్యలకి దూరంగా ఉంటున్నాడు.

Advertisement

 

పవిత్ర లోకేష్ గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. పవిత్ర లోకేష్ గతంలో నటించిన  కొన్ని సన్నివేశాలు, ఆ సినిమాలలో నటించిన పలు సీన్స్ ఫోటోలు, ఒకప్పుడు పవిత్ర హీరోయిన్ ఎంట్రీ కోసం  దిగిన ఫోటోలు బయటకొచ్చాయి. ఈ ఫోటోలలో పవిత్ర లోకేష్ అప్పట్లోనే కాస్త బోల్డుగా  కనిపించాయి.. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వంటి ఫోటోలు  సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

 

కాగా ఈ ఫోటోలపై కొందరు నెటిజన్లు నెగిటివ్ గా ట్రోల్స్ కామెంట్లు చేస్తున్నప్పటికీ నటి పవిత్ర లోకేష్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కాగా నరేష్ ను టార్గెట్ చేస్తూ మీరు స్పందించండి ఇలా ఉంటే ఓకేనా అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. కాగా నరేష్ కి పవిత్ర పాస్ట్ తెలుసు కాబట్టి ఈ ఫోటోలు చూసి మొదట్లో షాక్ అయినా ఇవన్నీ కామన్ అని లైట్ తీసుకున్నారట.

పవిత్ర లోకేష్, నరేష్ గతంలో ఎవరితో ఎలా ఉన్నా కూడా.. వీరి ప్రేమ మాత్రం చాలా అన్యోన్యంగా చాలా నిజాయితీగా ఉందని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.. వారిద్దరూ తమ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందికరవ వాతావరణంలో ఉండేవారు.. కానీ వీళ్ళిద్దరి బంధం మాత్రం చాలా కొత్తగా అందరికీ ఇన్స్పిరేషన్ లాగా ఉంది అంటూ ఫిలింనగర్ లో ఒక టాక్ నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఈ ఫోటోలు బయటకు రావడంతో వారిద్దరి మీద ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా వాటిని వాళ్లు కేర్ చేయడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి.

నరేష్ పవిత్ర లోకేష్ టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇలాంటి రూమర్స్ ను గాసిప్లను పెద్దగా ఎంకరేజ్ చేయవద్దని.. ఇటువంటి న్యూస్లను పట్టించుకోవద్దని వారు కోరుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ ఆర్టికల్ని పాజిటివ్ యాంగిల్ లో మాత్రమే చూడాలని కోరుకుంటున్నాము. ఎవరిని కించపరిచే ఉద్దేశంతో మాత్రం రాయలేదు. పవిత్ర లోకేష్ స్వతంత్రంగా తమ కాళ్ళపై తమ బతకాలనుకునే ఎంతోమంది స్త్రీలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారని మేము భావిస్తున్నాము..

Advertisement